శ్రేయా ఘోషల్ కన్సర్ట్‌లో ప్రేయసికి ప్రపోజ్ చేసిన ప్రియుడు

68చూసినవారు
కోల్‌కతాలో సింగర్ శ్రేయా ఘోషల్ నిర్వహించిన కన్సర్ట్‌ ఆహూతులను అలరించింది. కచేరి మధ్యలో ఇద్దరు ప్రేమికులతో ఆమె మాట్లాడారు. అందరి ముందు ప్రపోజ్ చేస్తావా? అని ప్రియుడిని ప్రశ్నించగా అతను ఓకే చెప్పాడు. మోకాలిపై కూర్చొని ప్రియురాలికి ప్రపోజ్ చేయగా ఆమె అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా శ్రేయా ఘోషల్ వీరికి ఓ పాటను అంకితం చేసి ఈ ప్రేమ జంటకు మర్చిపోలేని క్షణాలను అందించారు. ఈ ఆసక్తికర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

సంబంధిత పోస్ట్