నియోజకవర్గంలో పని చేసే అధికారులు అవినీతికి పాల్పడితే వారికి తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీ నాయన) అన్నారు. ఆదివారం కోటలో విలేకరులతో మాట్లాడుతూ అవినీతికు దూరంగా ఉన్న అధికారులు మాత్రమే నియోజకవర్గంలో ఉండాలన్నారు. అవినీతి చేస్తున్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.