కొమరాడ మండలంలోని 13 గ్రామాలలో జలజీవన్ మిషన్ పనులు జరుగుతున్నట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారి నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సీతమాంబపురం, కొత్తవలస, పెదకేర్జల, రేగులపాడు, పూర్ణపాడు గ్రామాలలో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని సూచించారు.