ఆలమూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పదో తరగతి విద్యార్థిని వెన్నెల తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. శుక్రవారం పవన్ రాజమహేంద్రవరం వెళ్తున్న క్రమంలో వెన్నెల తల్లిదండ్రులు కాన్వాయ్‌ను అడ్డుకుని ఆపారు. ఈ క్రమంలో కాన్వాయ్ దిగిన పవన్.. వారి సమస్యలు విన్నారు. వెన్నెల ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.