తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం (నవంబర్ 1) టోకేన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ఈ మేరకు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లన్ని భక్తులతో నిండిపోయాయి. ఇక దీపావళి సందర్భంగా గురువారం శ్రీవారిని 63,987 మంది దర్శించుకున్నారు. వారిలో 20,902 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.