రెడ్ బుక్‌ను చూసి
వైసీపీ అధినేత
జగన్ భయపడుతున్నారని మంత్రి నారా
లోకేశ్ అన్నారు.
అమెరికా పర్యటనలో భాగంగా అట్లాంటాలో
ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రెడ్ బుక్ భయంతో
జగన్ గుడ్ బుక్ తీసుకొస్తున్నారని, బుక్‌లో ఏం రాయలో ఆయనకు అర్థం కావట్లేదన్నారు. గతంలో సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులు పెట్టి లుకౌట్ నోటీసులు ఇచ్చేవారని, ఆ సమయంలో ఎన్ఆర్ఐలు ధైర్యంగా నిలబడి పోరాడారన్నారు.