AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.10 గంటలకు కంకిపాడు మండలం గుడువర్రులో పర్యటిస్తారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం గుడివాడ మండలంలోని మల్లయ్యపాలెంకు బయలుదేరుతారు. అక్కడ రక్షిత తాగు నీటి పథకానికి సంబంధించిన కార్యక్రమాల గురించి అధికారులతో చర్చిస్తారు.