వైసీపీ నేతలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. మాచవరంలోని సరస్వతి పవర్ భూములను పరిశీలించిన అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తులు లాక్కొని.. తమ సొంత ఆస్తిలా భావించి జగన్ కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటున్నారని అన్నారు. 'వైసీపీ నాయకులు ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారు. ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే వారి తోలు తీస్తా' అని వార్నింగ్ ఇచ్చారు.