అమరావతి, పోలవరం రాష్ట్రానికి రెండు కళ్లు అని సీఎం చంద్రబాబు నేడు అసెంబ్లీలో అన్నారు. 'పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఓ గేమ్ ఛేంజర్. ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి వెన్నుముక, జీవనాడి. నదుల అనుసంధానం రాష్ట్రానికి ముఖ్యం. గతంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాను గోదావరికి అనుసంధానం చేశాం. దీని ద్వారా మిగులు జలాలను రాయలసీమకు తరలించాం. 7 మండలాలు ఏపీలో కలపకపోయి ఉంటే పోలవరం ఎప్పటికీ కష్టమే' అని అన్నారు.