భారతీయ జనతా పార్టీపై ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజల్లో తనపై విద్వేషాన్ని వ్యాప్తి చేసేందుకు కాషాయ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అందుకు రూ.500 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలోని సంకీర్ణ ప్రభుత్వం గురించి బూటకపు ప్రచారం చేసేందుకు కోట్లు ఖర్చు చేసి 9 వేలకు పైగా వాట్సాప్ గ్రూప్‌లను సృష్టించిందని పేర్కొన్నారు.