మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా తక్కువ వడ్డీ రేటుకే రుణాలు మంజూరు ప్రకటించింది. 'అస్మిత' పేరుతో స్పెషల్ లోన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వ్యాపార, పారిశ్రామికవేత్తలకు సులభంగా లోన్లు అందిస్తామని పేర్కొంది. మహిళల కోసం 'నారీ శక్తి' డెబిట్ కార్డును రూపొందించినట్లు తెలిపింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా తక్కువ వడ్డీకే మహిళలకు లోన్లు ఇస్తామని ప్రకటించింది.