దేశంలోనే తొలిసారిగా వరంగల్‌లో గోల్డ్‌లోన్ ఏటీఎం అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం సాయంతో కేవలం 10 నిమిషాల్లో ఆధార్ కార్డు ద్వారా గోల్డ్‌లోన్ పొందవచ్చని కొత్తవాడలోని సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ ఎండీ తెలిపారు. ఏఐ సాంకేతికతతో ఈ ఏటీఎం పనిచేస్తుందని వివరించారు.