జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు లేక ఎయిడెడ్ పాఠశాలలు మూతపడటంతో ఖాళీగా 15 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులు మిగిలి ఉన్నారు. వీరిని జిల్లాలో ఎక్కడా సర్దుబాటు చేయకుండా వదిలివేశారు. కంభం, కొమరోలు, గిద్దలూరులోని ఎయిడెడ్ స్కూళ్లకు చెందిన 15 మంది పనులు లేకపోయినా నెల నెలా వేతనాలు పొందుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి అందరికీ ఒకసారి కౌన్సిలింగ్ నిర్వహించి సేవలు వినియోగించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.