బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి
బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి వద్ద ఆగి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును గురువారం ఓ ద్విచక్ర వాహన దారుడు వెనక నుంచి ఢీకొట్టాడు. ఘటనలో గిద్దలూరుకు చెందిన కొమరోలు కృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి గిద్దలూరులోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. సాంకేతిక లోపంతో బస్సు రోడ్డు పక్కన నిలిచిపోవడంతో కనిపించక ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.