రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం పామూరులో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించి అనంతరం రక్తదానం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం చేయడం అభినందనీయమని రక్తదానం చేసే వ్యక్తులు ప్రాణదాతలుగా నిలిచిపోతారని పేర్కొన్నారు.