
కనిగిరి: వారి పైన లీగల్ చర్యలు తీసుకుంటాం
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం పై శనివారం గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీనిపై జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి, కనిగిరి జనసేన పార్టీ ఇన్చార్జి వరికూటి నాగరాజు పార్టీ కార్యాలయంలో శనివారం ఫైర్ అయ్యారు. డ్రోన్ ఎగరటంపై ఉన్నతాధికారులకు జనసేన పార్టీ తరఫున ఫిర్యాదు చేశామని, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీని వెనక ఎవరు ఉన్న వారిపై లీగల్ చర్యలు తీసుకుంటామన్నారు.