ప్రకాశం జిల్లా మార్కాపురంలో దీపావళి సందర్భంగా నరకాసుర వధ కార్యక్రమం గురువారం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామిని ఆలయం వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామిని పట్టణ మాడ. వీధుల్లో ఊరేగించారు. అనంతరం స్వామివారి ఎదుట నరకాసురుడిని వధించారు. రధం బజార్, రాజాజీ వీధి, నాయుడు బజార్లోనూ నరకాసురుడి దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసి దహనం చేశారు.