మార్కాపురంలోని జార్జ్ బీఫార్మసీ కళాశాల సమీపంలో బుధవారం కొండచిలువ కనిపించడంతో విద్యార్థులు హడలిపోయారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు కొండచిలువను బంధించారు. తర్వాత స్థానిక అటవీ ప్రాంతంలో కొండచిలువను విడిచిపెట్టారు. కొండచిలువను బంధించడంతో కళాశాలలోని విద్యార్థులు ఊపిరిపించుకున్నారు. కొండచిలువ 9 అడుగులకు పైగా ఉంటుందని స్నేక్ క్యాచర్ నిరంజన్ తెలిపారు.