మహిళా సంఘాలతో కలిసి ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు!

75చూసినవారు
మహిళా సంఘాలతో కలిసి ప్రభుత్వం సోలార్ ప్లాంట్లు!
తెలంగాణ రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో మహిళా పొదుపు సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించే దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. తాజాగా దీనికి సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్