గరియాబాద్ ఎన్‌కౌంటర్‌లో మరో కీలక నేత మృతిచెందాడు. మావోయిస్టు కీలక నేతను హతమార్చినట్లు భద్రతా బలగాలు తాజాగా ప్రకటించాయి. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన ప్రమోద్ అలియాస్ చంద్రహాస్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు బలగాలు తెలిపాయి. చంద్రహాస్ ఒడిస్సాతోపాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నాడు. చంద్రహాస్‌పై రూ. 20 లక్షల రివార్డు కూడా ఉంది.