అద్దంకి: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేక మాలలు ముందుకు రావాలి
ఎస్సీ వర్గీకరణ, క్రిమిలేయర్ విధానం అమలును నిరసిస్తూ సోమవారం అద్దంకి మండలం కొటికలపూడి గ్రామంలో నియోజకవర్గ మాల మహానాడు కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాల మహానాడు అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు ఏకతాటిపై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సహకరించిన కోటికలపూడి అంబేద్కర్ యూత్ కు, జై భీమ్ ఉద్యోగుల సంఘానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.