కొరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామంలో మంగళవారం ఒక్కసారిగా జోరు వాన మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల నుండి వాతావరణం చల్లబడి, ఈదురు గాలులతో కూడిన భారీ వాన గ్రామమంతా కురుస్తుంది. గత 2 రోజుల నుండి వర్షం లేకపోవడంతో, అల్ప పీడనం తగ్గిందని భావిస్తున్న గ్రామస్తులలో, ఈ వాన కొంతమేర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. దినసరి వేతన కూలీలు ఆందోళన చెందారు.