అద్దంకి పట్టణం కామేపల్లి కళ్యాణ మండపంలో మంగళవారం మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల ఎంపీడీవో సింగయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారు 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, 10వ తరగతి నుండి పీ. జీ పూర్తి చేసిన వారు అర్హులు అని తెలిపారు.