అద్దంకి మండలం సింగరకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తన భార్య అదృశ్యమైంది అంటూ భర్త చిరంజీవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఖాదర్ భాషా తెలిపారు. తన భార్య ఉదయం కళాశాలకు వెళ్లి సాయంత్రమైనా ఇంటికి రాలేదని భర్త చిరంజీవి ఫిర్యాదు లో పేర్కొన్నట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలియజేశారు.