కొరిశపాడు: కిశోరి వికాసంపై అవగాహన కార్యక్రమం
కొరిశపాడు మండల పరిషత్ కార్యాలయం నందు మంగళవారం కిశోరి వికాసంపై సెక్రటరీలు, అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ కృష్ణకుమారి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో లోని గ్రామాలలో కిశోరి వికాసం పై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలికల అక్రమ రవాణా, బాల్య వివాహాలుగురించి అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు.