ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మంగళవారం ఎంపీపీ తులసమ్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఆపరేషన్లు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆసుపత్రులలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని వైద్యులు తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్యం పొందవచ్చని ఎంపిపి తులసమ్మ అన్నారు.