గిద్దలూరు: ఈత సరదా ప్రాణం తీసింది
ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం గ్రామ సమీపంలోని ప్రతాప్ రెడ్డి కాలనీ వద్ద సగిలేరు వాగులో స్నేహితులతో కలిసి గడ్డం గజ్జ ఆనంద్ (20) అనే యువకుడు ఈతకు వెళ్ళాడు. స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఈత కొడుతుండగా పరమాదవశాత్తు వాగులో మునిగి మృతి చెందాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.