Apr 07, 2025, 16:04 IST/
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు!
Apr 07, 2025, 16:04 IST
తెలంగాణలో దక్షిణ మధ్య బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.