Oct 04, 2024, 14:10 IST/మంచిర్యాల
మంచిర్యాల
హత్య కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
Oct 04, 2024, 14:10 IST
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మేదరివాడలో ఇటీవల చింతం విజయలక్ష్మి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏసిపి ప్రకాష్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ బన్సీలాల్ తో కలిసి వివరాలు వెల్లడించారు. ఆస్తి పంపకాల విషయంలో హత్యకు పాల్పడిన చింత శ్రీకాంత్, చింత లక్ష్మిలను రైల్వేస్టేషన్ లో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.