TG: ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలోగ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) రికార్డు సృష్టించింది. 2024-25కు గాను రూ.2,012 కోట్లు వసూలైనట్లు అధికారులు వెల్లడించారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం కింద రూ.465 కోట్లు వసూలైందని వివరించారు. GHMC చరిత్రలో ఇదే అత్యధికమని అధికారులు పేర్కొన్నారు.