పెద్దారవీడు: ప్రత్యక్షమైన మహిళ అఘోరి
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట సమీపంలో సోమవారం మహిళ అఘోరి ప్రత్యక్షమైంది. ఆమె కారులో ప్రయాణిస్తున్న దృశ్యాలను స్థానికులు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ దృశ్యాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కార్తీక మాసం నేపథ్యంలో శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు వచ్చినట్లుగా మహిళ అఘోరి చెప్పినట్లుగా స్థానిక ప్రజలు చెబుతున్నారు.