తర్లుపాడు: పిడుగుపాటుకు గేదె మృతి
ప్రకాశం జిల్లా తర్లుపాడులో పిడుగుపాటుకు ఓ గేదే మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. గ్రామ సమీపంలోని పొలాలలో రైతు సుబ్బారెడ్డి తన గేదెను మేత కోసం తీసుకువెళ్లాడు. ఆ సమయంలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పాటు గేదె అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన గేదె విలువ రూ. 60 వేల వరకు ఉంటుందని రైతు సుబ్బారెడ్డి తెలిపాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.