కాంగ్రెస్ 420 హామీల చిట్టా తమ దగ్గర ఉందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. కాంగ్రెస్ సంబురాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, అబద్దాల పునాధులపై రేవంత్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు.. ఫోర్త్ సిటీ కోసం రైతుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు. నర్మద, సబర్మతి నదుల్లానే మూసీ అభివృద్ధి జరగాలన్నారు. మోదీని విమర్శించే స్థాయి సీఎం రేవంత్‌కు లేదన్నారు.