చేయి తడిపితేనే సంతకం!
తర్లుపాడు తహసీల్దార్ కార్యా లయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రతిపనికి ఒకరేటు నిర్ణయించి ప్రజలను జలగల్లాగా పీక్కుతింటున్నారు. పైసలిస్తేనే సంతకం పెడతామని భీష్మించుకు కూర్చుంటున్నారు. మండలంలో గత ప్రభుత్వంలో జరిగిన ఫ్రీహోల్డ్ భూములకు కూడా ఎకరాకు రూ.30వేల చొప్పున వసూలు చేశారు. విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలకు రూ.500చొప్పున కొందరు విద్యార్థుల సర్టిఫికెట్‌లకు వీఆర్‌వో లు, డిప్యూటీ తహసీల్దార్‌లు సంతకాలు పెట్టినప్పటికీ తన వాట తనకు ఇవ్వంది సంతకం పెట్టేది లేదంటూ తహసీల్దార్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఒక చిన్నపాటి ఉద్యోగి చేత డబ్బులు వసూలు చేయిస్తున్నారు.