ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. దాదాపు 80 వేల ఏళ్ల తరవాత అరుదైన తోకచుక్క మెరిసింది. అక్టోబర్ మొదటి వారంలో భారత్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో ఇది కనిపించింది. అక్టోబర్ 12-24 మధ్య కాలంలో భూమికి అత్యంత దగ్గరగా రానుంది. తాజాగా ఏపీలోనూ తిరుపతిలో ఈ దృశ్యం కనిపించింది. తిరుపతికి చెందిన ఆస్ట్రో ఫొటోగ్రాఫర్ డాక్టర్ అవినాశ్ ముక్కామల ఈ ఫొటోలు తీశారు. సోషల్ మీడియాలో షేర్ చేశారు.