దేవీ నవరాత్రులలో పాల్గొన్న ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా, త్రిపురాంతకంలోని బాల త్రిపుర సుందరిదేవి ఆలయంలో గురువారం నుంచి ప్రారంభమైన దేవి నవరాత్రులలో ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తర్వాత పల్లకి మోసారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ లో ఆయన పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాలలో స్థానిక నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.