రాబోయే పండుగ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జన్నారం ఎస్సై రాజవర్ధన్ తెలిపారు. మండల ప్రజలు తమ ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఊర్లకు వెళ్తున్న ప్రజలు బంగారం, డబ్బు లాంటివి ఇళ్లలో ఉంచవద్దని తెలిపారు. ఆన్లైన్లో సీసీ కెమెరాలు తక్కువ ధరకే దొరుకుతున్నాయని వెల్లడించారు. దొంగతనాలు జరగకుండా ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని వివరించారు.