తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిపై అత్యాచారం

534చూసినవారు
తల్లితో సహజీవనం చేస్తూ.. కూతురిపై అత్యాచారం
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు నగరంలోని మున్సిపల్ క్వార్టర్స్‌లో షకీరా భాను అనే మహిళ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమెకు ఆరో తరగతి చదివే కూతురు ఉంది. నవీన్ అనే యువకుడితో షకీరా భాను పరిచయం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నారు. అయితే నవీన్ కన్ను షకీరా భాను కూతురుపై పడింది. తల్లి సహాయంతో కూతురిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక కనిపించకపోవడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో నవీన్ ఆకృత్యాలు వెలుగులోకి వచ్చాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్