ఏపీలో భూ బాధితుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ప్రకటించారు. రెవెన్యూ శాఖలో ఆన్‌లైన్ ట్యాంపరింగ్, రికార్డుల తారుమారుపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వీఆర్‌వోల నుంచి కలెక్టర్ల వరకు అధికారులందరూ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.