విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా షర్మిల ధర్నా

65చూసినవారు
ఏపీలో విద్యుత్ ఛార్జీల సర్దుబాటును వ్యతిరేకిస్తూ PCC చీఫ్ వైఎస్ షర్మిల బుధవారం ధర్నాకు దిగారు. విజయవాడ ధర్నా చౌక్‌లో ఆమె మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఐదు నెలల్లోనే రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారని, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో రాష్ట్ర ప్రజలకు హైవోల్టేజ్‌ షాక్ ఇచ్చారని ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై రూ.6 వేల కోట్ల భారం వేశారని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. YCP, TDP దొందూ దొందే అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్