ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూసుకుంటాం

60చూసినవారు
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూసుకుంటాం
ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడమే లక్ష్యంగా సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నామని ఎస్పి కే. ఆరీఫ్ ఆఫీస్ తెలిపారు. నెల్లూరు జిల్లాలోని మరిపాడు, నవాబుపేట, కందుకూరు తదితర ప్రాంతాల్లో సాయుధ బలగాలతో బుధవారం కవాతు నిర్వహించారు. ప్రజలు భయాన్ని వీడి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్