మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నరేంద్ర మోడీ కార్యక్రమానికి రాష్ట్రపతి భవన్ నుంచి కావలి నియోజకవర్గానికి చెందిన నాయకుడికి ఆహ్వానం అందింది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మెర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కంచర్ల మురళీకృష్ణ నాయుడు కి ఆహ్వానం అందింది. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనాలని రాష్ట్రపతి భవన్ నుంచి ఒక లేఖను ఆయనకు పంపించారు.