మొదటిసారి పోటీ చేస్తున్న కృష్ణారెడ్డిని గెలిపించండి

64చూసినవారు
మొదటిసారి పోటీ చేస్తున్న కృష్ణారెడ్డిని గెలిపించండి
కావలి నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి మద్దతుగా కావలి పట్టణంలోని పలు వార్డుల్లో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆదివారం ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు అందజేసి కూటమి మేనిఫెస్టో గురించి వివరించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న కృష్ణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్