మనదేశంలో చట్టాలు ఆమోదించడానికి ఏండ్ల తరబడి పోరాటాలు చేయాలి కానీ.. ఉల్లంఘనలకు క్షణాలు చాలు. నేరస్తులు దాడులు, అత్యాచారాలకు తెగబడుతూనే ఉన్నారు. నెలల పసికందా? మైనరా? గర్భవతా? వృద్ధురాలా? ఇలాంటివేమీ పట్టవు. ఐదు నిమిషాల కోరిక కోసం క్రూరంగా మారుతున్నారు. ఇది లైంగికానందమే కాదని, ఎదుటి మనిషి నిస్సహాయంగా ఉంటే హింసించే శాడిస్టిక్ ప్లెజర్ అని సైకాలజిస్టులు చెబుతున్నారు.