బుచ్చిరెడ్డిపాలెం: కామాక్షమ్మకు ఘనంగా వడాయతి ఉత్సవం

75చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్లకు ఆదివారం రాత్రి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా వడాయతి ఉత్సవం నిర్వహిస్తారు. కుంభహారతి మండపంలో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో స్వామి అమ్మవార్లకు విశేష పూజ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు విచ్చేసి దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్