
పెద్దపాలెం: విద్యార్థికి కోవూరు ఎమ్మెల్యే సన్మానం
10 తరగతిలో 590 మార్కులు సాధించిన విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన మీనంగారి తులసీరాం అనే విద్యార్థిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సన్మానించారు. ఆదివారం ఊటుకూరులో జరిగిన కార్యక్రమంలో అనే మాట్లాడుతూ ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా తులసీరాంను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదవాలని ఆమె సూచించారు.