ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ

58చూసినవారు
ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
ఇందుకూరుపేట మండలం జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పెంచలయ్య సందర్శించారు. పలు రికార్డులను రిజిస్టర్లను పరిశీలించారు. ఆశా డే సందర్భంగా వైద్య సిబ్బంది ఆశావాలంటీర్లతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధులు, అడల్ట్ బి సి జి వ్యాక్సినేషన్ కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్