నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. సూర్య తేజ సూచనల మేరకు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ వై. ఓ. నందన్ నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేయుచున్న సిబ్బందికి ఎన్ఐసి టీం వారి ద్వారా ఈ ఆఫీస్, ఈ ఫైలింగ్ నిర్వహణ పై బుధవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఇనాయతుల్లా, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.