బీఎస్పీ కోవూరు అభ్యర్థిగా కడింపాటి అనిల్

68చూసినవారు
బీఎస్పీ కోవూరు అభ్యర్థిగా కడింపాటి అనిల్
బహుజన సమాజ్ పార్టీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థిగా కడింపాటి అనిల్ కుమార్ ను ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. కోవూరు నియోజకవర్గంలోని యల్లయపాలెం గ్రామానికి చెందిన కడింపాటి అనిల్ న్యాయవాద విద్య అభ్యసించారు. బహుజన ఉద్యమాల పట్ల సానుభూతిపరుడుగా ఉంటూ బిఎస్పీలో అడుగుపెట్టి అనతి కాలంలోనే క్రియాశీలకంగా పని చేస్తున్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్