ఉదయగిరి నియోజకవర్గంలోని 143 పంచాయతీలలో తాగునీటి ఎద్దడి నివారణే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆర్ డబ్ల్యుఎస్ శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం నెల్లూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ ఈడీ రాధయ్య తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.